• facebook
  • whatsapp
  • telegram

AP RESULTS: ఏపీ ఎనర్జీ అసిస్టెంట్‌ పరీక్ష తుది ఫలితాలు విడుదల

 

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ జూనియర్‌ లైన్‌మెన్ల గ్రేడ్‌ 2 పరిధిలోని ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను అక్టోబర్‌ 19న విడుదల చేసింది. ఈ జాబితాను సంబంధిత వెబ్‌సైట్‌ https://recruitment.apeasternpower.com/SiteContent/Results  లో పొందుపరిచినట్లు సంస్థ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలను పరిశీలించుకోవచ్చు. అక్టోబర్‌ 10న నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 398 మంది పురుష అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నారు.  

Posted Date : 19-10-2021