• facebook
  • whatsapp
  • telegram

 AP Group-1 Prilims Results: ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక

 ఏప్రిల్‌ 23 నుంచి 29వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు

 ఏపీపీఎస్సీ వెల్లడి

 

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ జ‌న‌వ‌రి 27న ప్రకటించింది. జ‌న‌వ‌రి 8వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష రాసిన వారిలో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 6,455 మందిని ప్రధాన పరీక్ష రాసేందుకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ప్రధాన పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. వాస్తవానికి గ్రూప్‌-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగిందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

 

 

ఫ‌లితాలు

స్టడీ మెటీరియల్‌

 

స్క్రీనింగ్ టెస్ట్ 

సెక్షన్ - ఎ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

 

మెయిన్స్ 

పేపర్ - 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

పేపర్ - 2 ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం

పేపర్-3 భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ