* అధికారిక ప్రకటన విడుదల
ఏపీలోని న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాల తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను జనవరి 30న విడుదల చేసింది. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి మూడు నుంచి ఐదు వారాల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అమరావతిలోని హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి ఏపీ హైకోర్టు డిసెంబర్ 21 నుంచి జనవరి 1వరకు ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. పరీక్ష కీపై వచ్చిన 189 అభ్యంతరాల్లో 21 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!