• facebook
  • whatsapp
  • telegram

AP Paramedical: ఏపీలో 2446 పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ

రాత పరీక్ష లేకుండానే ఎంపిక

ఉమ్మడి నోటిఫికేషన్లతో జిల్లాల్లో మొదలైన నియామక ప్రక్రియ

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా పారా మెడికల్ నియామకాలు జరుగుతున్నాయి. ఈ శాఖలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఉండే పోస్టులకు హెచ్ఓడీ కార్యాలయాలు గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేసేవి. ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం ఒకే నోటిఫికేషన్తో మూడు విభాగాల్లో పోస్టులకు అర్హులవుతారు. అంతేకాదు.. ఈ నోటిఫికేషన్లకు వచ్చే దరఖాస్తులను ఏడాదిపాటు పరిగణనలోకి తీసుకుంటారు. అంటే, ఈ ఏడాదిలో ఏదైనా పోస్టు ఖాళీ అయితే దానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఇప్పటికే ఉన్న దరఖాస్తుల నుంచి ఎంపికచేస్తారు. 2446 పైగా రకరకాల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ల జారీ మొదలైంది. వీటిలో జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఎలక్ట్రీషియన్, ఈసీజీ, ఈఈజీ, డైటీషియన్, డెంటల్ హైజినిస్ట్, క్యాథ్ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, బయోమెడికల్ ఇంజినీర్, ఆడియో, విజువల్, ఆడియోమెట్రీ, బయోమెడికల్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లాంటి 42 రకాల పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ పోస్టులను ఒప్పంద విధానంలోనే భర్తీచేస్తున్నారు. 

 

ఒకే అర్హతతో పోస్టుల భర్తీ

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో 42 రకాల పారా మెడికల్ పోస్టుల్లో అవసరమైన వాటిని ఒకే అర్హతతో నియమిస్తున్నారు. జిల్లాల్లో నోటిఫికేషన్ల జారీ మొదలైంది. జిల్లా కలెక్టర్ నియామక కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పోస్టుల వారీగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మెరిట్ ప్రాతిపదికన కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూపిస్తారు. అభ్యర్థి తమకు నచ్చిన పోస్టును ఎంపికచేసుకోవచ్చు.

 

ఉమ్మడి జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు...
 

 శ్రీకాకుళం

 నెల్లూరు
 విజయనగరం  వైఎస్ఆర్
 పశ్చిమగోదావరి  అనంతపురం
 కృష్ణా  విశాఖపట్నం
 చిత్తూరు  కర్నూలు
 ప్రకాశం  గుంటూరు
 తూర్పుగోదావరి  


 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సోషల్‌ మీడియాలో సమయం వృథా అవుతోందా?

‣ ఎల్‌ఐసీ హౌసింగ్‌లో కొలువులు

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.