• facebook
  • whatsapp
  • telegram

యూజీ, పీజీలో దరఖాస్తులకు ఆహ్వానం 

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ మణిపూర్‌లో యూజీ, పీజీ కోర్సుల్లో 2021-2022 సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్, ఎంఎస్సీ ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ సైకాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆగస్టు 19వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు

Posted Date : 05-08-2021