• facebook
  • whatsapp
  • telegram

APPSC: 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

* జారీ చేసిన ఏపీపీఎస్సీ

 

 

ఈనాడు, అమరావతి: 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ సెప్టెంబ‌రు 28న‌ 9 నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలనూ ప్రకటించింది. 72 ఆయుర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్స్‌, మూడు ఆయుర్వేద లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. 11/2022 నోటిఫికేషన్‌ కింద ఏపీ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ సబ్‌ సర్వీస్‌లో 12 శాంపిల్‌ టేకర్‌, 8 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ ప్రొహిబిషన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, ఇతర పోస్టులు కలిపి 45 ఉన్నాయి. 23 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, ఏడు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీచేసింది. 06/2022 నోటిఫికేషన్‌ కింద ఆరు పోస్టులను గ్రూప్‌-4 కేటగిరీలో భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

 

నోటిఫికేషన్ల వారీగా ఖాళీల వివరాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.