• facebook
  • whatsapp
  • telegram

Applications: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మాచవరం, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి కోసం అర్హులైన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్‌ తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం ద్వారా నగరంలోని ‘సింక్రోసర్వ్‌ గ్లోబల్‌ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ వారు శిక్షణ అందిస్తారన్నారు. జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌ కోర్సుకు 30 రోజుల తర్ఫీదు ఇవ్వనున్నట్లు చెప్పారు. పదో తరగతి పూర్తి చేసి, 15 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులు. జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌ (అడ్వాన్డ్స్‌ క్రిటికల్‌ కేర్‌) కోర్సుకు 35 రోజులు శిక్షణ ఇస్తారు. పదో తరగతి, ఆపై చదువుకున్నవారు, 15 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు 95508 53636, 95508 33636 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ మిధానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్‌లు

‣ బార్క్‌, ముంబయిలో వివిధ ఖాళీలు

‣ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, కేరళ సర్కిల్‌లో ఖాళీలు 

‣ బెల్‌, చెన్నైలో 73 అప్రెంటిస్‌ ఖాళీలు 

‣ యూపీఎస్సీ - 64 పోస్టులు

Posted Date : 28-10-2021