• facebook
  • whatsapp
  • telegram

Army Ordnance Corps: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో 1,793 ట్రేడ్స్‌మ్యాన్‌, ఫైర్‌మ్యాన్‌ పోస్టులు 

సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్… దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది.

వివరాలు:

1. ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌: 1249 పోస్టులు

2. ఫైర్‌మ్యాన్‌: 544 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,793

రీజియన్లు: ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌, నార్తెర్న్‌, సదరన్‌, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్.

అర్హతలు: ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌, ఐటీఐ; ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900; ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: https://www.aocrecruitment.gov.in/

 

నోటిఫికేషన్


 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!