* 29 నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్ జాబితాను వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలుంటే బుధవారం(మార్చి 29) ఉదయం 10.30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు తెలపాలని బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి మంగళవారం(మార్చి 28) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు లాగిన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలపాలని, ఇతర రూపాల్లో పంపితే పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ టీచర్లు అందుబాటులో లేకుంటే ఖాళీల్లో 15 శాతం పోస్టులను నాన్ మెడికల్ టీచర్లతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అత్యధికంగా గైనకాలజీ 187 పోస్టులు, అనస్థీషియాలో 177 పోస్టులు భర్తీ కానుండగా తర్వాత స్థానాల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలు ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.