ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా నిర్వహించిన చేతిరాత పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు అవార్డులు సాధించారని చేతిరాత శిక్షణదారుల సంఘం కార్యదర్శి మహబూబ్ హుసేన్ తెలిపారు. విజయవాడలో ఎనిమిదో తరగతి చదువుతున్న సేనాపతి జివితేష్‌కి నేషనల్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్, తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆలపాటి ప్రహార్షిక నేషనల్ ఎక్స్‌లెన్సీ బస్ట్ హ్యాండ్‌రైటింగ్, అవ్యక్తా ప్రద్యుమ్న పూజారికి మిస్ ఇండియా బెస్ట్ హ్యాండ్‌రైటింగ్ అవార్డులు లభించాయని వెల్లడించారు. ప్రపంచ కాలిగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 11న జరిగే అంతర్జాతీయ చేతిరాత పోటీలకు వీరు ఎంపికయ్యారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో 30లక్షల మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారని, జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డుల్లో మూడు రాష్ట్రానికి దక్కాయని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.