• facebook
  • whatsapp
  • telegram

Intigrated course: మూడేళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సు ప్రవేశపెట్టిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: ఒకేసారి బీఈడీ-ఎంఈడీ కలిపి చేసే మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈమేరకు గురువారం నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనలు- 2014ను సవరించింది. 2021 సంవత్సరానికి సంబంధించిన కొత్త నిబంధనలు జారీచేసింది. ఇది మూడేళ్ల పూర్తిస్థాయి ప్రోగ్రామ్‌. మధ్యలో ఆపేయడానికి వీలుండదు. మూడేళ్లు పూర్తిచేయాల్సిందే. ఉపాధ్యాయులు, టీచర్‌ ఎడ్యుకేటర్స్, విద్యారంగంలో ఇతర నిపుణులను తయారుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కోర్సును ప్రవేశపెట్టింది. 

 

 

మరింత సమాచారం ... మీ కోసం!
‘టెట్‌’ కాలపరిమితి.. జీవితకాలం
'టెట్‌' సన్నద్ధతకు తుది మెరుగులు

Posted Date : 16-10-2021