• facebook
  • whatsapp
  • telegram

6లోగా ఒప్పంద అధ్యాపకులు దరఖాస్తులు సమర్పించాలి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు రెన్యువల్‌ కోసం దరఖాస్తులు సమర్పించాలని ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకులు ఒక ప్రకటనలో కోరారు. జోన్‌-1లో 149, జోన్‌-2లో 168 పోస్టులను పునరుద్ధరించేందుకు 31-3-2021 నాటికి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరంలో పనిచేయాలనుకునేవారు ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెన్యువల్స్‌ కోసం ఆగస్టు 10వ తేదీన జిల్లా ఎంపిక కమిటీ సమక్షంలో వీరికి కౌన్సెలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు.

Posted Date : 04-08-2021