• facebook
  • whatsapp
  • telegram

B Tech Students: బోధనకూ బీటెక్‌ బాబుల సై

ఈనాడు, హైదరాబాద్‌: బీఈడీ చదివేందుకు ఆసక్తి చూపుతున్న బీటెక్‌ అభ్యర్థులు పెరుగుతున్నారు. రాష్ట్రంలో 2017-18 విద్యా సంవత్సరంలో తొలిసారిగా బీటెక్‌ పట్టభద్రులకు బీఈడీ చదివేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో 1202 మంది, 2019లో 1719 మంది ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణులయ్యారు. తాజాగా  2563 మంది దరఖాస్తు చేయగా 1805 మంది పరీక్ష రాశారు. వారిలో 1803 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. కొలువుల కోసం రెండేళ్లపాటు ఎదురుచూసి అవి దక్కని వారు ఏదో ఒక పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరుతున్నారని, వారే బీఈడీ చదువుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆ విద్యార్హత ఉండి, టీఆర్‌టీ నోటిఫికేషన్‌ వెలువడితే ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులకు పోటీపడవచ్చని చాలామంది యోచిస్తున్నారు. అందుకే ఎడ్‌సెట్‌ ద్వారా బీఈడీ పూర్తిచేయాలని భావిస్తున్నారు.

Posted Date : 26-09-2021