• facebook
  • whatsapp
  • telegram

CAT 2021: సెప్టెంబరు 25 నుంచి దరఖాస్తు స‌వ‌ర‌ణ 

కామన్ అడ్మిషన్ టెస్ట్ 2021 (క్యాట్ 2021) దరఖాస్తు ఫారంలో ఏవైనా స‌వ‌ర‌ణ‌లు ఉంటే సెప్టెంబరు 25 (ఉదయం 10) నుంచి చేసుకోవ‌చ్చు. ఇంత‌కు ముందు నింపిన CAT 2021 దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారులు తమ ఫొటో, సంతకం, టెస్ట్ సిటీ ప్రాధాన్యతలను సెప్టెంబరు 27 సాయంత్రం 5 గంటల వ‌ర‌కు సవరించవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్ CAT 2021ను నవంబరు 28న దేశవ్యాప్తంగా 158 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనుంది. CAT 2021 పేపర్‌లో మూడు విభాగాలు ఉంటాయి: వెర్బల్ ఎబిలిటీ - రీడింగ్ కాంప్రహెన్షన్; డేటా ఇంటర్‌ప్రెటేషన్-లాజికల్ రీజనింగ్; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
‣ CAT 2021 అడ్మిట్ కార్డులు అక్టోబరు 27 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) అందించే మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు.

Posted Date : 24-09-2021