• facebook
  • whatsapp
  • telegram

Central Jobs: కేంద్రంలో కొలువుల మేళా.. 

75 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!
* ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, భోజనం, స్టడీ మెటీరియల్‌
* పదో తరగతి అర్హతతో దరఖాస్తు అవకాశం
* ఫిబ్రవరి 20 నుంచి రాత పరీక్షలు
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో 75 వేల కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) ఖాళీలు భర్తీకానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయో పరిమితి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. రాత పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ ఇటీవలే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ప్రారంభ వేతనం రూ.18,000- రూ.56,900 ఉంటుంది.

గతేడాది 50,187 ఖాళీల భర్తీ

గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. 


ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ, భోజనం, స్టడీ మెటీరియల్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చేపట్టే కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు పరవస్తు క్రియేటివ్‌ ఫౌండేషన్, రామ్‌కీ ఫౌండేషన్‌ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్‌లు న‌వంబ‌రు 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి అయిదు నెలల పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233, 7337585959, 9000797789ని సంప్రదించవచ్చు. 


  Useful Study Material  


General Intelligence and Reasoning 

General Knowledge

General Awareness

Elementary Mathematics

English


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.