• facebook
  • whatsapp
  • telegram

IIT Hyderabad: 5జీ టెక్నాల‌జీలో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం

సైన్స్‌, ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

ఈనాడు, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌, వైసిగ్‌ అంకుర సంస్థలు కలిసి సరికొత్త సర్టిఫికెట్‌ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ‘భవిష్యత్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌’ అంశం ఆధారంగా 12 నెలల కాలవ్యవధితో కూడిన కోర్సులా దీనిని రూపొందించాయి.

ఐఐటీ హైదరాబాద్‌ దేశంలోనే తొలిసారిగా 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. రానున్న రోజుల్లో ఈ రంగంలో పనిచేసే వారికి ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఈ క్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిలో ఆ మేరకు నైపుణ్యాలను పెంచేందుకు ఈ కోర్సు దోహదపడనుంది. ఆగస్టు 1 నుంచి తరగతులు మొదలు కానున్నాయి. జులై 10తో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ప్రతిభ కనబర్చిన వారికి ప్రతినెలా రూ.25వేల స్కాలర్‌షిప్‌ కూడా అందించనున్నారు. ఏటా 500 మంది ఇంజినీర్లను సుశిక్షితులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కోర్సుకు రూపకల్పన చేశారు. 50 వరకు ప్రీప్లేస్‌మెంట్‌ ఆఫర్లు దక్కేలా చూడనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో 6జీపైనా పరిశోధనలు సాగుతున్నాయి. దాదాపు 200 మందికి ఈ పరిశోధన, అభివృద్ధి విభాగంలో అవకాశాలు కల్పించనున్నారు. 5జీ సాంకేతికత రంగంలో మానవవనరుల కొరతను అధిగమించేందుకు ఈ కోర్సు దోహదం చేస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ సంచాలకుడు ఆచార్య బీఎస్‌ మూర్తి మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌లలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులని ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్‌ జీవీవీ శర్మ ఆ ప్రకటనలో వివరించారు. 4 మాడ్యూళ్ల ఈ ప్రోగ్రాంలో ఒకటి పూర్తయినా ఆ మేరకు ధ్రువపత్రం తీసుకుని బయటకు వెళ్లడానికి అవకాశం ఉంది. మరిన్ని వివరాలను  fcw.iith.ac.in  ద్వారా తెలుసుకోవచ్చు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చక్కెర కోర్సులు చక్కని కొలువులు

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.