• facebook
  • whatsapp
  • telegram

EAMCET: ముగిసిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

* ప్రత్యేక విడత నాటికి 57,177 మందికి బీటెక్‌ సీట్ల కేటాయింపు

* 26లోపు స్వయంగా రిపోర్ట్‌ చేస్తేనే సీటు ఉండేది

* త్వరలో స్లైడింగ్, స్పాట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ 

* ఎడ్‌సెట్‌, లాసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ సీట్లను నవంబరు 24న అధికారులు కేటాయించారు. కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ ముగిసింది. మొత్తం 57,177 మందికి బీటెక్, 223 మందికి బీఫార్మసీ సీట్లను కన్వీనర్‌ కోటాలో కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబరు 26లోపు ఫీజు చెల్లించి, స్వయంగా కళాశాలలో రిపోర్ట్‌ చేస్తేనే సీటు ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు. టీసీ మాత్రమే అసలు ధ్రువపత్రం(ఒరిజనల్‌) ఇవ్వాలని, మిగిలినవి ఫొటోస్టాట్‌ కాపీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. 

 

మరోవైపు.. సీట్లు పొందిన వారిలో రెండు, మూడు వేలమంది కళాశాలల్లో చేరకపోవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కన్వీనర్‌ కోటాలో మొత్తం 79,856 సీట్లుండగా.. ఇంకా 22,679 మిగిలిపోయాయి. సీఎస్‌ఈలో 19,101 సీట్లుంటే 1505 మాత్రమే మిగిలాయి. ఈసీఈలో 74.48 శాతం నిండాయి. మెకానికల్‌ బ్రాంచీల్లో 5,902 సీట్లుంటే 1663 మాత్రమే(28.18) భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.31 శాతం, ఈఈఈలో 41.88 శాతం సీట్లు నిండాయి. త్వరలో స్లైడింగ్‌తో పాటు స్పాట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. స్లైడింగ్‌లో విద్యార్థులు అదే కళాశాలలో ఖాళీలుంటే ఇతర బ్రాంచీలకు మారిపోవచ్చు. అలా మారితే వారికి బోధనా రుసుం వర్తించదు. 

 

లాసెట్, పీజీఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల..

* నవంబరు 27 నుంచి డిసెంబరు 6 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన.

* డిసెంబరు 11 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు.

* డిసెంబరు 17న ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం సీట్ల కేటాయింపు.

* డిసెంబరు 27 నుంచి ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం తరగతులు.

 

ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారు..

* డిసెంబరు 1 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన.

* డిసెంబరు 18 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు.

* డిసెంబరు 24న బీఈడీ సీట్ల కేటాయింపు.

* డిసెంబరు 30 నుంచి బీఈడీ తరగతులు.

 

డిగ్రీ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు..

* ప్రత్యేక విడతలో 38,441 మందికి డిగ్రీ సీట్లు కేటాయింపు.

* నవంబరు 26 వరకు సెల్ఫ్ రీపోర్టింగ్ చేసి కాలేజీల్లో చేరాలి.

* నవంబరు 27 నుంచి 29 వరకు ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లకు అవకాశం.

* నవంబరు 30న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు.

* నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు స్పాట్ అడ్మిషన్లు.
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పది ప్రశ్నలతో పరీక్షిద్దాం!

‣ ప్రతి విషయానికీ అతిగా ఆలోచనలా?

Posted Date : 24-11-2021