ఈనాడు, హైదరాబాద్: దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో సహాయ కేంద్ర(హెల్ప్‌డెస్క్) సమన్వయకర్త పోస్టుకు అర్హులైన ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.శైలజ తెలిపారు. పొరుగుసేవల విధానంలో ఈ పోస్టును భర్తీ చేయనున్నట్లు, నెలకు రూ.50 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, సోషియాలజీ, సైకాలజీ, సోషల్‌వర్క్‌లో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టుకు అర్హులన్నారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆ మేరకు అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 10లోగా పోస్టు ద్వారా కానీ, నేరుగా మలక్‌పేటలోని డైరెక్టరేట్ కార్యాలయంలో కానీ అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-24559048 నంబర్లో సంప్రదించాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.