• facebook
  • whatsapp
  • telegram

TS Police Jobs: ‘పోలీసు’ పరీక్షల్లో కటాఫ్‌ మార్కుల వెల్ల‌డి

200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను సవరిస్తున్నట్లు ప్రభుత్వం అక్టోబ‌రు 17న‌ హైకోర్టుకు తెలిపింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం ఉండగా.. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌లను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

********************************************************

స్టడీ మెటీరియ‌ల్‌ - ప్రిలిమ్స్

‣ ఇంగ్లిష్
‣ అర్థ‌మెటిక్‌
‣ జనరల్ సైన్స్
‣ భార‌త‌దేశ చ‌రిత్ర‌, సంస్కృతి, భార‌త జాతీయ ఉద్య‌మం
‣ భార‌త‌దేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌
‣ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విష‌యాలు
‣ రీజ‌నింగ్‌, మెంట‌ల్ ఎబిలిటీ
‣ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

 

స్టడీ మెటీరియ‌ల్‌ - మెయిన్స్

‣ పేపర్ - 1: ఇంగ్లిషు
‣ పేపర్ : 2: తెలుగు
‣ పేపర్ - 3: అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 పేపర్ - 4: జనరల్ స్టడీస్

 

‣ పాత ప్రశ్నప‌త్రాలు

‣ నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.