• facebook
  • whatsapp
  • telegram

Defence Jobs: రెండు దశాబ్దాల్లో ఏపీ నుంచి 71 వేల మంది నియామకం 

 

 

ఈనాడు, దిల్లీ: గత రెండు దశాబ్దాల్లో త్రివిధ దళాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 71,400 మంది నియమితులైనట్లు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌భట్‌ తెలిపారు. ఆయన ఆగస్టు 5న లోక్‌సభలో తెదేపా సభ్యుడు కె.రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఆర్మీలో నియామకాల కోసం 2014-15 నుంచి 2019-20 మధ్య 6 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 14 ర్యాలీలు నిర్వహించామని, 4,04,901 మంది అభ్యర్థులు పాల్గొన్నారని చెప్పారు. వైమానికదళం కోసం 2018, 2019ల్లో నిర్వహించిన పరీక్షకు 33,999 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. నౌకాదళంలో సెయిలర్లుగా చేరడానికి 2017, 2018, 2019ల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,58,174 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 1990 నుంచి జరిగిన భారత వాయుసేన విమాన ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే నేవీలో ఆరుగురు కన్ను మూసినట్లు వెల్లడించారు. 2022 జూన్‌ 30 నాటికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికోద్యోగుల సంఖ్య 6,641కి చేరిందని తెలిపారు.  

 

మంగళగిరి ఎయిమ్స్‌లో నర్సింగ్‌ కాలేజీ 

మంగళగిరి ఎయిమ్స్‌లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్‌ కాలేజీ ప్రారంభానికి చర్యలు తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. ఆమె ఆగస్టు 5న లోక్‌సభలో వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.