• facebook
  • whatsapp
  • telegram

Degree Admissions: 15 వరకు డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు  

పెడనగ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల నమోదుకు ఆగ‌స్టు 15 వరకు అవకాశం కల్పించారు. కొత్త షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. 16 నుంచి 19 వరకు ఆన్‌లైన్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇదే సమయంలో విద్యార్థుల నమోదు సమయంలో ధ్రువపత్రాలు పొందపర్చకపోతే వాటిని అప్‌లోడ్‌ చేయటానికి అవకాశం కల్పించారు. గుర్తింపు(అఫిలియేషన్‌) ఇచ్చిన కళాశాలల జాబితాను ఆగ‌స్టు 20, 21 తేదీల్లో విశ్వవిద్యాలయ అధికారులు వెబ్‌సైట్లో ఉంచుతారు. కృష్ణా విశ్వవిద్యాలయ ఆచార్యుల బృందాలు కళాశాలల పరిశీలన చేసిన సమచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత విద్యామండలి సైట్లో పంపుతున్నారు. గుర్తింపు పొందిన కళాశాలలకు ఆగ‌స్టు 22 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 30న కళాశాలలకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు తెలిపారు. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.