• facebook
  • whatsapp
  • telegram

Results: పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణావిశ్వవిద్యాలయం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించి డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ, బీటెక్‌ ఎనిమిదో సెమిస్టర్‌ ఫలితాలను ఉపకులపతి కె.బి చంద్రశేఖర్‌ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 19న విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.డి రామశేఖరరెడ్డి తెలిపారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ పునఃమూల్యాంకనం కోసం  సెప్టెంబర్ 28, బీటెక్‌ ఎనిమిదో సెమిస్టర్‌ కోసం 27వ తేదీలోపు నిర్దేశిత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. రిజిస్ట్రార్‌ ఎం.రామిరెడ్డి, యూజీ పరీక్షల సమన్వయకర్త డా.ఎం.శ్రావణి, పీజీ పరీక్షల సమన్వయకర్త డా.ఇ.భవానీ పాల్గొన్నారు.

Posted Date : 19-09-2021