• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ 17 నుంచి 

ఈనాడు, అమరావతి: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, స్వయంప్రతిపత్తి కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సెప్టెంబ‌రు 17నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్, 23 నుంచి 26 వరకు కళాశాలలు, కోర్సుల ఎంపిక, 29న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. విద్యార్థులు సెప్టెంబ‌రు 30, అక్టోబరు 1న కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడా కోటాకు సంబంధించిన ప్రత్యేక కేటగిరి విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల (విజయవాడ), డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ కళాశాల(విశాఖపట్నం), ఎస్వీ విశ్వవిద్యాలయం(తిరుపతి)లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో 23, 24న హాజరుకావాల్సి ఉంటుంది. 

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

మానవుల్లో శిలీంద్రాల వల్ల వచ్చే వ్యాధులు

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో 535 ఖాళీలు

Posted Date : 16-09-2021