• facebook
  • whatsapp
  • telegram

PhD: సీఎస్‌ఈలో పీహెచ్‌డీకి డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పీహెచ్‌డీ ప్రవేశాలకు విపరీతమైన పోటీ నెలకొంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం దాదాపు అయిదేళ్ల తర్వాత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్‌సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు ఏకంగా ఒక్కొక్క సీటుకు 56 మంది పోటీపడుతున్నారు. ఈ విభాగంలో పది సీట్లు ఉండగా.. ఇప్పటికే 562 దరఖాస్తులు అందాయి. కామర్స్‌, ఇంగ్లిష్‌, రసాయనశాస్త్రాలకూ ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. ఈ దఫా సీట్లను మూడు కేటగిరీల్లో భర్తీ చేస్తున్నారు. కేటగిరి-1 కింద యూజీసీ, సీఎస్‌ఐఆర్‌, ఐసీఏఆర్‌, ఐసీఎంఆర్‌, డీబీటీ వంటి సంస్థల నుంచి జేఆర్‌ఎఫ్‌ సాధించిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన సీట్లను కేటగిరి-2 కింద వర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. కేటగిరి-3 లో విదేశీ విద్యార్థులు, కార్పొరేట్‌, వృత్తి నిపుణులకు సీట్ల లభ్యత ఆధారంగా నేరుగా ప్రవేశాలు ఉంటాయి. ప్రస్తుతం కేటగిరీ-2 కింద పది విభాగాల పరిధిలో 468 సీట్లు ఉన్నట్లు ఓయూ చూపించింది. వీటి భర్తీకి ఆగస్టులో నోటిఫికేషన్‌ ఇవ్వగా.. అక్టోబ‌రు ఒకటో తేదీతో గడువు ముగుస్తోంది. సెప్టెంబ‌రు 30న‌ సాయంత్రం నాటికి అన్ని సీట్లకు కలిపి 6,535 దరఖాస్తులు అందాయి. చివరి రోజైన అక్టోబ‌రు 1న‌ మరికొన్ని వచ్చే అవకాశం ఉందని వర్సిటీ ప్రవేశాల విభాగం సంచాలకుడు ప్రొ.ఐ.పాండురంగారెడ్డి ‘ఈనాడు’కు వివరించారు. కంప్యూటర్‌ సైన్స్‌ తర్వాత అధికంగా కామర్స్‌కు 517 మంది, ఇంగ్లిష్‌కు 439, రసాయనశాస్త్రానికి 360 మంది దరఖాస్తు చేసుకున్నారు. న‌వంబ‌రు నెలలో కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్ష జరగనుంది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.