• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా

సెప్టెంబ‌రు 28కి బదులు అక్టోబరు 11 నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సెప్టెంబ‌రు 28 నుంచి మొదలు కావాల్సిన ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. దాన్ని అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రారంభించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. బీటెక్‌ ఫీజులపై స్పష్టత రాకపోవడం వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా సెప్టెంబ‌రు 28 నుంచి ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తే తొలి విడతలో సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి తుది గడువు సెప్టెంబ‌రు 26. అప్పటికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) మొదటి విడత సీట్ల కేటాయింపు మాత్రమే పూర్తవుతుంది. దానివల్ల రెండు, ఆ తర్వాత రౌండ్లలో సీట్లు వస్తే ఎంసెట్‌లో చెల్లించిన 50 శాతం రుసుమును కోల్పోవాల్సి వస్తుంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొన్న అధికారులు రెండో విడతను అక్టోబరు 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అంటే తొలి విడతలో సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి సెప్టెంబ‌రు 26 వరకు ఉన్న గడువును అక్టోబరు 9 వరకు పొడిగించే అవకాశం ఉంది. అప్పటికి జోసా నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్‌ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ కౌన్సెలింగ్‌ కాలపట్టిక...
అక్టోబరు 11-12 వరకు: ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం
12న: ధ్రువపత్రాల పరిశీలన
12, 13 తేదీల్లో: వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడం
16న: సీట్ల కేటాయింపు
16-18వ తేదీ: ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం

‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?

‣ స్టడీమెటీరియల్‌.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!

‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.