• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి   

కాచిగూడ, న్యూస్‌టుడే: నేషనల్‌ కంప్యూటింగ్‌ కౌన్సిల్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ రేణుకారెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, కంప్యూటర్‌ అక్కౌంటెన్సీ టాలీ, మాస్టర్‌ డిప్లొమా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు, వెబ్‌ డిజైన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు జూన్‌ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు 95058 00042 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Posted Date : 14-06-2021