• facebook
  • whatsapp
  • telegram

ఈఏపీసెట్‌కు 2.51లక్షల దరఖాస్తులు  

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు 2,51,491 దరఖాస్తులు వచ్చాయి. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తుకు జులై 25న‌ అర్ధరాత్రితో గడువు ముగిసింది. ఇంజినీరింగ్‌కు 1,70,761 దరఖాస్తులు రాగా.. ఇందులో అమ్మాయిలు 68,371, అబ్బాయిలు 1,02,390 మంది ఉన్నారు. వ్యవసాయం, ఫార్మసీకి కలిపి 80,041మంది దరఖాస్తు చేయగా.. వీరిలో అమ్మాయిలు 53,640, అబ్బాయిలు 26,401మంది ఉన్నారు. వ్యవసాయం, ఇంజినీరింగ్‌కు కలిపి 689 మంది దరఖాస్తు చేశారు.
 

Posted Date : 27-07-2021