• facebook
  • whatsapp
  • telegram

Latest Results: 18-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Degree: డిగ్రీలో తెలుగు మాధ్యమం కనుమరుగు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని కళాశాలల్లోనూ అమలు చేయాలని పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. KU PG Exams: కేయూ ఐదేళ్ల పీజీ కోర్సుల్లో సెప్టెంబరు 22 నుంచి పరీక్షలు 

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న పీజీ ఐదేళ్ల కోర్సుల్లో సెప్టెంబరు 22వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ సెప్టెంబరు 17న పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Medical Posts: త్వరలో 430 వైద్యపోస్టుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఏడాది(2022-23) వైద్యవిద్య సంవత్సరానికి అందుబాటులోకి రానున్న 8 కొత్త వైద్యకళాశాలల్లో పోస్టుల భర్తీకి త్వరలో నియామక ప్రకటన వెలువడనుంది. మొత్తంగా 430 వైద్య పోస్టులను అఖిల భారత స్థాయిలో భర్తీ చేయనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Mahindra Versity: సెప్టెంబరు 22 వరకు మహీంద్రా యూనివర్సిటీలో ప్రవేశాలు 

ఈనాడు, హైదరాబాద్‌: మహీంద్రా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబరు 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు ఉపకులపతి మేడూరి యాజులు తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. OU: ఓయూ పరీక్షలు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో సెప్టెంబరు 20వ తేదీన జరిగే అన్ని పరీక్షలను గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌వెంకటేశ్‌తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 18-09-2021