• facebook
  • whatsapp
  • telegram

CPGET: సీపీ గెట్‌ పరీక్షల వాయిదా

 

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 19, 20 తేదీలలో నిర్వహించాల్సిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల(సీపీగెట్‌-2021)ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Posted Date : 19-09-2021