• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 18-09-2021 (తెలుగు)

1. ఓం ణమోకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు

ఓం ణమో నవల ఉత్తమ తెలుగు అనువాదంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2020కి ఎంపికైంది. కన్నడలో ఇదే పేరుతో శాంతినాథ దేశాయ్‌ రచించిన నవలను తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనువదించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. రైతు ఆదాయం రోజుకూలీ కంటే తక్కువ

రైతులు కొండంత కష్టపడినా వారికి దక్కేది గోరంతే. హెక్టారు (2.50 ఎకరాల్లోపు) భూమి ఉన్న రైతు కుటుంబానికి రోజుకు సగటున రూ.224 మాత్రమే ఆదాయం వస్తోంది. రోజు కూలి చేసే వారికి గ్రామాల్లో రూ.300- 500, నగరాల్లో రూ.600-700 వస్తోంది. ప్రభుత్వంలో చిన్నస్థాయి ఏ ఉద్యోగికైనా నెలకు కనీసం రూ.20 వేలు వస్తుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. నీతి ఆయోగ్‌ పునర్వ్యవస్థీకరణ

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సచివాలయం ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ సంస్థ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్, పూర్తిస్థాయి సభ్యులు వీకే సారస్వత్, రమేష్‌చంద్, వీకే పాల్‌లను యథాతథంగా కొనసాగించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి బాధ్యతల స్వీకరణ

తమిళనాడు 26వ గవర్నర్‌గా రవీంద్రనారాయణ్‌ రవి బాధ్యతలు స్వీకరించారు. గిండిలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. జీఎం హోదా సాధించిన రిత్విక్‌

భారత చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. 17 ఏళ్ల తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్‌ జీఎం హోదా అందుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మూడో చెస్‌ ఆటగాడిగా.. మొత్తంగా దేశంలో 70వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 19-09-2021