• facebook
  • whatsapp
  • telegram

IIT Goa మూడువారాల రిసెర్చ్ ఇంట‌ర్న్‌షిప్‌

ఐఐటి గోవా 3 వారాల రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గోవా ఫిజిక్స్‌లో మాస్టర్స్ చదివే విద్యార్థుల కోసం మూడు వారాల రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌లను  యాక్సిలరేటింగ్ విజ్ఞాన్‌ స్కీమ్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ బోర్డ్ (ఎస్ఈఆర్‌బీ) కింద‌ అందిస్తోంది. 
ఈ ఇంటర్న్‌షిప్ ప్ర‌ధాన లక్ష్యం యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రైవేట్ అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లు, కొత్తగా స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌ల‌ విద్యార్థులను హైయ‌ర్ న్యూక్లియ‌ర్ ఎన‌ర్జీ ఫిజిక్స్ రంగంలో పరిశోధనలు చేప‌ట్టే విధంగా ప్రోత్స‌హించ‌డం. 
ఈ 3 వారాల రిసెర్చ్‌ ఇంటర్న్‌షిప్ కు ఎంపికైన అభ్యర్థులు 'Probing the QCD matter produced at RHIC and LHC' అనే ప్రాజెక్టులో ప‌ని చేయ‌డానికి అవ‌కాశం పొందుతారు. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు Google form ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
అర్హ‌త‌: అభ్య‌ర్థి బీఎస్‌సీ ఫిజిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు కలిగి, ఎంఎస్‌సీ ఫిజిక్స్ చివ‌రి ఏడాది చ‌దువుతుండాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: 2021 సెప్టెంబరు 29 (సాయంత్రం 6)

Posted Date : 24-09-2021