• facebook
  • whatsapp
  • telegram

Postpone Exams: వాయిదా పడిన పరీక్షలు 4, 5 తేదీల్లో.. 

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: వాయిదా పడిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ-2021)లను అక్టోబరు 4, 5వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. సెప్టెంబరు 19, 20వ తేదీల్లో జరగాల్సిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలను గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా వాయిదా వేశారు. చరిత్ర, రసాయనశాస్త్రం, రాజనీతిశాస్త్రం, బీసీఈఎస్‌ఎఫ్‌ఎస్‌జీ అండ్‌ ఎం, కంప్యూటర్‌ సైన్స్‌ పరీక్షలను 4న, ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం, హిందీ, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ ప్రవేశ పరీక్షలు 5న జరగనున్నాయి. పూర్తి వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను చూడాలని వర్సిటీ అధికారులు సూచించారు.

Posted Date : 27-09-2021