• facebook
  • whatsapp
  • telegram

HPS: వరంగల్‌లో పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపు 

 

వరంగల్‌: వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్కూల్‌ ఏర్పాటుకు హెచ్‌పీఎస్‌ సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తిలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలం మార్కెట్‌ ధరకు కేటాయించారు. ఈ మేరకు హెచ్‌పీఎస్‌ సొసైటీ వైస్ ఛైర్మన్‌కు మంత్రి ఎర్రబెల్లి జీవో కాపీ అందజేశారు. 

Posted Date : 18-10-2021