• facebook
  • whatsapp
  • telegram

Indian Army: ఆర్మీ రాత పరీక్ష వాయిదా

 

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జులైలో నిర్వహించిన ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 31న జరగాల్సిన రాత పరీక్షను ఆర్మీ అధికారుల సూచన మేరకు నిరవధికంగా వాయిదా వేసినట్లు జిల్లా యువజన సేవలు- స్టెప్‌ సీఈవో శ్రీనివాసరావు అక్టోబరు 18న తెలిపారు. తిరిగి పరీక్షను ఎప్పుడు నిర్వహించేది, పరీక్ష కేంద్రం వివరాలను తర్వాత తెలియజేస్తామన్నారు. గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి పాల్గొన్న అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. 

Posted Date : 18-10-2021