• facebook
  • whatsapp
  • telegram

M.PED: ఎంపీఈడీ ఎంట్రెన్స్‌లో కరీంనగర్‌ రెజ్లర్ల హవా

కరీంనగర్‌ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో భాగంగా ఎంపీఈడీ (మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)లో కరీంనగర్‌ రెజ్లర్లు మెరుగైన ర్యాంకులు సాధించారు. ఈ మేరకు 2021-23 విద్యా సంవత్సరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన కామన్‌ పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు అక్టోబరు 21న విడుదలయ్యాయి. ఇందులో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన రెజ్లింగ్‌ క్రీడాకారుడు ఆకునూరు వినయ్‌ రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. కరీంనగర్‌ క్రీడా పాఠశాల పూర్వ విద్యార్థిని శిరీష 11వ ర్యాంకు, చింతకుంటకు చెందిన అఖిల్‌ 17వ ర్యాంకు సాధించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించిన రెజ్లింగ్‌ క్రీడాకారులను కరీంనగర్‌ జిల్లా అమెచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తుమ్మల రమేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ కరీంలు అభినందించారు.

Posted Date : 22-10-2021