• facebook
  • whatsapp
  • telegram

Assistant Surgeon:  అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాల దరఖాస్తు గడువు పెంపు

 

ఈనాడు డిజిటల్, అమరావతి: పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబరు 24 వరకు పొడిగించినట్లు ఆ శాఖ సంచాలకులు డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ వెల్లడించారు. అర్హత గల అభ్యర్థులు విజయవాడలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వయంగా సమర్పించాలని సూచించారు. తొలుత అక్టోబరు 10 వరకు గడువు నిర్ణయించామని, పరిపాలన కారణాల దృష్ట్యా పొడిగించినట్లు అక్టోబరు 22న తెలిపారు.

Posted Date : 22-10-2021