• facebook
  • whatsapp
  • telegram

NIT: 2024 నాటికి నిట్-సిక్కిం శాశ్వత క్యాంపస్

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి సిక్కింలో శాశ్వత క్యాంపస్‌ను 2024 నాటికి పూర్తిచేస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ పేర్కొన్నారు. ఖమ్‌డాంగ్‌లో నిర్మించే ఈ క్యాంపస్‌కు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు భూమి కేటాయించినట్లు చెప్పారు. ఇందుకు కేంద్రం తరఫున రూ.500 కోట్లు అందించామన్నారు. ప్రస్తుతం నిట్‌ సిక్కింను రావాంగ్లలోని తాత్కాలిక క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. రానున్న రెండున్నరేళ్లలో యాంగ్‌యాంగ్‌లోని సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీని కూడా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. 

Posted Date : 26-10-2021