• facebook
  • whatsapp
  • telegram

EWS Quota: ఇంటర్‌లోనూ ఈడబ్ల్యూఎస్‌ కోటా

* జులై 01 నుంచి అధికారికంగా ప్రథమ సంవత్సర ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటాను అమలు చేయనున్నారు. వారికి 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో అధికారికంగా ఇంటర్‌మీడియట్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలు జులై 01 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు జూన్‌ 30న కాలపట్టికను జారీ చేసింది. జులై 11వ తేదీ నుంచి ఫస్టియర్‌ తరగతులు మొదలుకానుండగా ఆగస్టు 17తో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు ఆధార్‌ సంఖ్య తప్పనిసరని బోర్డు పేర్కొంది. మరో వైపు ప్రైవేట్‌ కళాశాలల్లో జూన్‌ మొదటి వారం నుంచే తరగతులు మొదలుకావడం గమనార్హం.

ఇంప్రూవ్‌మెంట్‌ ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.150  
ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాసైన వారు మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలంటే ఒక్కో పేపర్‌కు రూ.150 ఫీజు చెల్లించాలి. సాధారణ పరీక్ష ఫీజు రూ.490కి అవి అదనం. వారికి ఎందులో ఉత్తమ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. సబ్జెక్టులో తప్పినా అంతకుముందువే ఉంటాయి. 
 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.