• facebook
  • whatsapp
  • telegram

RGUKT Admissions: ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు ప్రకటన విడుదల

* దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జులై 15

ముథోల్, న్యూస్‌టుడే: గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించే నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు జూన్‌ 30న డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ప్రకటన (నోటిఫికేషన్‌) విడుదల చేశారు. 2022-23 విద్యాసంవత్సరానికి 1,500 సీట్ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి విద్యార్థులు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ ప్రక్రియ (టీఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్స్‌) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటి సమర్పణకు చివరి తేదీ జులై 15గా నిర్ణయించారు. పీహెచ్‌సీ, సీఏపీ, ఎన్‌సీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న ప్రతితోపాటు మిగతా ధ్రువపత్రాల నకళ్లను జులై 19 లోగా విద్యాలయానికి పంపాలని ప్రకటనలో పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు పంపాల్సిన అవసరం లేదు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జులైౖ 30న ప్రకటిస్తామని అందులో వివరించారు. 

 


 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.