• facebook
  • whatsapp
  • telegram

Medical Posts: 2,588 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోని అవసరాలకు వివిధ రకాల 2,588 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర జులై 1న ఉత్తర్వులిచ్చారు. 446 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 30 డెంటల్‌ సర్జన్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులను పదోన్నతి, ఒప్పంద, పొరుగుసేవల విధానంలో నింపుతారు. వీటిలో ప్రధానంగా పోస్టుమార్టమ్‌ సహాయకులు-348, థియేటర్‌ అసిస్టెంట్లు-279, ల్యాబ్‌ టెక్నీషియన్లు-235, స్టాఫ్‌నర్సులు-55, ఫార్మసిస్టు గ్రేడ్‌ 1-74, జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌-684 కౌన్సెలర్స్‌-52, ఇతర పోస్టులు ఆమోదం తెలిపిన జాబితాలో ఉన్నాయి.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోల్‌ ఇండియాలో కొలువులు

‣ సుప్రీంకోర్టులో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

‣ మోడల్‌ టెస్ట్‌లు రాయండి!

‣ విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.