• facebook
  • whatsapp
  • telegram

Olympiad: సెమ్స్‌ ఒలింపియాడ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో 1 - 12 తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్‌ ఒలింపియాడ్‌-2023కు సెప్టెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపియాడ్‌ సమాచార పత్రం, కరపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ‌స్టు 11న‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒలింపియాడ్‌ కన్వీనర్‌ ఆరుకాల రామచంద్రారెడ్డి, కోఆర్డినేటర్‌ ఎస్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదట ప్రాథమిక పరీక్షలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహిస్తామని, ఈ పరీక్షలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దశల వారీగా ఉంటాయన్నారు. అందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్‌కు ఎంపిక చేస్తామని, ఆ పరీక్షలు డిసెంబరు/ జనవరిలో జరుగుతాయని తెలిపారు. నాలుగోసారి ఒలింపియాడ్‌ను నిర్వహించబోతున్నామని, ప్రతిభావంతులకు రూ.కోటి విలువైన బహుమతులు అందజేస్తామని తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వ్యవసాయ కోర్సులకు జాతీయ పరీక్ష

‣ బ్యాంకు ఉద్యోగం... సాధించే వ్యూహం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.