• facebook
  • whatsapp
  • telegram

CPET: 'ప్లాస్టిక్‌ టెక్నాలజీ కోర్సులతో మెరుగైన ఉపాధి'  

ఈనాడు, అమరావతి: ప్లాస్టిక్‌ టెక్నాలజీలో కోర్సులు చేసే యువతకు భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోనికి రానున్నాయని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) జాయింట్‌ డైరెక్టర్‌ సిహెచ్‌.శేఖర్‌ తెలిపారు. భారత ప్రభుత్వ సంస్థ అయిన సిపెట్‌ విజయవాడలో తాజాగా డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. సిపెట్‌లో కోర్సులు పూర్తిచేస్తున్న యువతకు దేశవ్యాప్తంగా ప్లాస్టిక్, అనుబంధ సంస్థల్లో ప్రొడక్షన్, మౌల్డ్‌ తయారీ, క్వాలిటీ నిర్ధరణ విభాగాలలో ఖచ్చితమైన ప్లేస్మెంట్స్‌ దొరుకుతున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితి ఉన్న డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ) పదో తరగతి ఉత్తీర్ణులు, రెండేళ్ల పీజీడీ-పీపీటీ కోర్సుకు బీఎస్సీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. యువతీ యువకులకు వేర్వేరుగా హాస్టల్‌ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ప్రవేశాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం 9398050255 నంబరులో సంప్రదించాలని సూచించారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.