• facebook
  • whatsapp
  • telegram

AGNIVEER: ప్రశాంతంగా అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్

* స్టేడియంలోకి అభ్యర్థులు మాత్రమే అనుమతి

 

 

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ, జగదాంబ కూడలి), న్యూస్టుడే: విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపికలు మొదటి రోజు ఆగస్టు 14న ప్రశాంతంగా జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 31 వరకు ఈ ఎంపికలు జరగనున్నాయి. తెల్లవారుజాము నుంచి స్టేడియంలోకి అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. మిగిలిన వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంపికలు చేపడుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అభ్యర్థులు హాజరయ్యారు. అర్ధరాత్రి నుంచే అనుమతిస్తామని చెప్పటంతో ముందుగానే యువత స్టేడియానికి చేరుకున్నారు. కొద్దిపాటి గెడ్డం ఉన్నా అనుమతించకపోవడంతో అభ్యర్థులు సెలూన్ల వద్ద బారులు తీరారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సోషల్‌ మీడియాలో సమయం వృథా అవుతోందా?

‣ ఎల్‌ఐసీ హౌసింగ్‌లో కొలువులు

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.