తెవివి క్యాంపస్, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్‌తో పాటు సారంగాపూర్ ఎడ్యుకేషన్, భిక్కనూర్ దక్షిణ ప్రాంగణాలకు జూన్ 1 నుంచి 9 వరకు సెలవులు ప్రకటించినట్లు వీసీ ఆచార్య రవీందర్ మే 31న తెలిపారు. వసతి గృహాల్లో మరమ్మతు పనులున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, జూన్ 1న మధ్యాహ్నం తర్వాత విద్యార్థులు వసతి గృహాలు ఖాళీ చేసి వెళ్లాలన్నారు. ఆన్‌లైన్లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. వాస్తవానికి మే 31 వరకు గతంలో వర్సిటీకి వేసవి సెలవులు ఉన్నప్పటికీ.. 2023-24 నూతన విద్యా సంవత్సరం తరగతులు ముందస్తుగా ప్రారంభిస్తున్నట్లు మే 18వ తేదీన ప్రకటించారు. కొందరు అధ్యాపకులు విధులకు వస్తున్నప్పటికీ విద్యార్థులు మాత్రం రావడం లేదు. గతంలో నిర్ణయించినట్లుగా జూన్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాల్సి ఉండగా.. సెలవులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది.
ఉద్యమాన్ని ఆపేందుకే సెలవులు: పీడీఎస్‌యూ, ఏబీవీపీ
హాస్టళ్లలో మరమ్మతులు చేయాలని గతంలో అడిగినా అధికారులు స్పందించలేదని, వర్సిటీలో నెలకొన్న వివాదంపై విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని ఆపేందుకే వీసీ సెలవులు ప్రకటించారని పీడీఎస్‌యూ నాయకులు ఒక ప్రకటనలో ఆరోపించారు. వీసీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏబీవీపీ పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.