హైదరాబాద్: గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జూన్ 11న జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్ జడ్జి కొట్టేయగా.. ఆ ఉత్తర్వులను ధర్మాసనం వద్ద ఓ విద్యార్థి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.