• facebook
  • whatsapp
  • telegram

27న విద్యాసంస్థల బంద్‌ 

నారాయణగూడ, న్యూస్‌టుడే: భారత్‌ బంద్‌లో భాగంగా 27న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూసివేసి బంద్‌ విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, టీజేఎస్‌ కోరాయి. నారాయణగూడ ఫ్లైఓవర్‌ కూడలిలో సెప్టెంబర్‌ 25న మానవహారం నిర్వహించారు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావేద్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిల్, శ్యామ్, నాగేశ్వరరావు, టీజేఎస్‌ ప్రతినిధులు పవన్, జీవన్‌ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ స్థానంలో ఉన్నత విద్యా కమిషన్‌ను తీసుకురావడమంటే పరిశోధనా రంగానికి నిధుల కోత విధించడమేనని విమర్శించారు.

 

Posted Date : 26-09-2021