• facebook
  • whatsapp
  • telegram

Ekalavya Gurukuls: జూన్‌కు ‘ఏకలవ్య’ నిర్మాణాల పూర్తికి ఆదేశం: మంత్రి సత్యవతి 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022 జూన్‌ నాటికి నిర్మాణంలో ఉన్న 12 ఏకలవ్య గిరిజన గురుకుల పాఠశాలల నిర్మాణాన్ని పూర్తిచేయాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన 21 గిరిజన గురుకులాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్టోబరు 22న గురుకులాల కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 44 గిరిజన గురుకులాల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా 21 పూర్తయ్యాయని, మరో 23 నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. కొత్త భవనాల్లో విద్యార్థులకు వేడినీటి వసతి కోసం అవసరమైన సౌర విద్యుత్‌(సోలార్‌) వ్యవస్థను ఏర్పాటు చేయాలని రెడ్కో అధికారులకు సూచించారు.

Posted Date : 23-10-2021