• facebook
  • whatsapp
  • telegram

Engineering: 25 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌!

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ అక్టోబ‌రు 25 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈలోపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఫీజుల ఖరారు, కళాశాలలకు అనుబంధ గుర్తింపు పూర్తి చేయాలని భావిస్తోంది. 18న ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పూర్తి షెడ్యూల్‌ను నిర్ణయించనున్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌పై  అక్టోబ‌రు 14న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వెబ్‌ పోర్టల్‌, ఆన్‌లైన్‌ ప్రవేశాలపైనా చర్చించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఫీజుల నిర్ణయంపై యాజమాన్యాల అభిప్రాయాలను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ అక్టోబ‌రు 18 నుంచి స్వీకరించనుంది. యాజమాన్యాలు ఇప్పటికే ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. వీటి ఆధారంగా ఫీజు ఎంత అనేది కమిషన్‌ నిర్ణయిస్తుంది. అనంతరం ఫీజుల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. 22లోపు ఫీజులు ఖరారు కానున్నాయి.

 

డిగ్రీ ప్రవేశాల ఐచ్ఛికాల నమోదుకు గడువు పొడిగింపు

డిగ్రీ ఆన్‌లైన్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీలో వెబ్‌ ఐచ్ఛికాల నమోదు గడువును అక్టోబ‌రు 17 వరకు పొడిగించారు. దసరా పండుగను పురస్కరించుకొని గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. సహాయ కేంద్రాలను 15 నుంచి 17 వరకు మూసివేయనున్నామని, రెండో విడత ప్రవేశాలకు వీటిని  పునఃప్రారంభిస్తామన్నారు.

 

 

 

ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్ -2021 మాక్ కౌన్సెలింగ్


ఇంజినీరింగ్

అగ్రికల్చర్ & మెడికల్‌


     


 

మరింత సమాచారం ... మీ కోసం!

 ‣ సీఎస్‌ఐఆర్‌-టీకేడీఎల్‌లో 64 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

 ‣ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు 

‣ వైద్య రంగంలో విలువైన కెరియర్‌

‣ ముచ్చటగా మూడోసారి!

Posted Date : 16-10-2021