దేశంలో సాంకేతిక విద్యాసంస్థలకు ఏఐసీటీఈ సిఫార్సు
ఈనాడు, అమరావతి: బీటెక్కు కనిష్ఠంగా రూ.79,600 గరిష్ఠంగా రూ.1,89,800 ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సిఫార్సు చేసింది. దేశంలోని సాంకేతిక విద్యాసంస్థలన్నింటికీ కనిష్ఠ, గరిష్ఠ బోధన రుసుములను ఏఐసీటీఈ సూచించింది. ఏఐసీటీఈ అనుబంధ గుర్తింపు ఉన్న ప్రైవేటు సాంకేతిక విద్యాసంస్థలకు బోధన రుసుములను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ ఫీజుల కమిటీ (ఎన్ఎఫ్సీ) సమర్పించిన నివేదికను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో 2015లో బోధన రుసుములు నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గతేడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. దీనిపై రాష్ట్రాల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించి, సమీక్షించేందుకు మరో ఉప కమిటీని నియమించింది. ఇప్పుడు తుది నివేదికను ఏఐసీటీఈ విడుదల చేసింది. బోధన రుసుముల్లో 15% కళాశాల అభివృద్ధి ఫీజులను వసూలు చేసుకోవచ్చని కమిటీ సూచించింది. కళాశాల విస్తరణ, ప్రధాన మరమ్మతులు, ప్రయోగశాల పరికరాలు, ఫర్నిచర్ కోసం వీటిని వినియోగించుకోవచ్చని పేర్కొంది. కనీస బోధన రుసుములను నిర్ణయించాలని చాలాకాలంగా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఏఐసీటీఈని కోరుతున్న నేపథ్యంలో కనీస, గరిష్ఠ ఫీజులను నిర్ణయించేందుకు కమిటీని నియమించింది. అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతనాలనూ సిఫార్సు చేసింది. కళాశాలలు మూడేళ్లలో చేసిన సరాసరి వ్యయాన్ని పరిశీలించి బోధన రుసుములను రాష్ట్రస్థాయి రుసుముల నియంత్రణ కమిటీ నిర్ణయించాలని జాతీయ ఫీజుల కమిటీ సిఫార్సు చేసింది. కళాశాలలకు అయా రాష్ట్రాల రుసుముల నియంత్రణ కమిటీలు నిర్ణయిస్తాయని పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
ఐఐఎస్ఎస్టీలో పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాములు
షిప్పింగ్ కోర్సుల్లో చేరతారా?
డీఏ-ఐఐసీటీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.