• facebook
  • whatsapp
  • telegram

Engineering: ఇంజినీరింగ్‌ రిజిస్ట్రేషన్‌లో.. తప్పుల దిద్దుబాటుకు ఐచ్ఛికం ఏదీ? 

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ ప్రవేశాల ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు సమయంలో ఏమైనా తప్పుగా నమోదు చేసి, సమర్పిస్తే దాన్ని సరి చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో కొందరు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించిన తర్వాత సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటే సాఫ్ట్‌వేర్‌ తీసుకోవడం లేదు. ఫోన్‌ నంబరును ఎవరంటే వారు మార్పు చేసేలా సాఫ్ట్‌వేర్‌ ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  ఇతరులెవరైనా ఫోన్‌ నంబరును మార్పు చేసి, ఓటీపీతో వివరాలను మార్చే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఏపీసెట్‌ పరీక్ష సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కే ఓటీపీ రావాలి. ఒకవేళ ఈ నంబరు మార్చుకోవాలంటే సహాయ కేంద్రానికి వెళ్లాలి. అప్పుడే విద్యార్థుల వివరాలకు భద్రత ఉంటుంది. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యలను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Posted Date : 28-10-2021